హైదరాబాద్ : కోవిడ్–19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలు. ఇదీ భాగ్యనగరిలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల మనోగతం అని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యయనంలో తేలింది. ‘95% కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 90–100% ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తు్తన్నారు. రెండు నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగింది.
ఉద్యోగుల ఉత్పాదకత 75% ఉన్నట్టు 80% కంపెనీలు తెలిపాయి. పెద్ద కంపెనీల్లో ఇది 90 శాతంగా ఉంది. బ్రాడ్‌బ్యాండ్, విద్యుత్ కోతలు, ఇంట్లో నెలకొన్న వాతావరణం ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఉద్యోగుల్లో ధైర్యం తగ్గిందని 34% మంది తెలిపారు. సుమారు 70% పెద్ద కంపెనీలు గత 6 నెలల్లో ఫ్రెషర్లను నియమించాయి. కొన్ని కంపెనీలు 1,000 మంది వరకు రిక్రూట్ చేసుకున్నాయి. ఆఫర్ లెటర్లు అందుకున్న ఫ్రెషర్లను నియమిస్తామని చాలా కంపెనీలు తెలిపాయి’ అని పేర్కొంది. (కోవిడ్-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..?)
ఇంటి నుంచే పని చేస్తాం: ఐటీ ఉద్యోగులు
Published Wed, Sep 23 2020 8:59 AM | Last Updated on Wed, Sep 23 2020 2:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment