ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఇటీవలే ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. యాపిల్ యొక్క తాజా ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. దీంతో పాటు వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒక డెలివరీ బాయ్ 14 ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లు తీసుకుని పారిపోయిన సంఘటన చైనాలో జరిగింది.
చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ రాజధాని గుయాంగ్‌లోని ఆపిల్ అధికారిక దుకాణం టాంగ్ పేరు గల డెలివరీ బాయ్ ని 14 కొత్త ఐఫోన్ 12 ప్రో మాక్స్ యూనిట్లను మరో ఆపిల్ దుకాణానికి తరలించామని కోరింది. ఆ డెలివరీ బాయ్ డెలివరీకి బదులుగా వాటిని తీసుకోని పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో 14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్లను తీసుకున్న తర్వాత ఆ ఆర్డర్‌ను రద్దు చేశాడు. ఈ ఆర్డర్‌ను నవంబర్ 14న చేశారు. ఈ ఆర్డర్‌ను రద్దు చేసినందుకు కేవలం 10 యువాన్లు చెల్లించాడు. అయితే ఆ వెంటనే 14 ఐఫోన్ ఫోన్లతో పారిపోయాడు. వీటిలో ఒక్కొక్కటి ధర 1,500 డాలర్లు. మన దేశంలో 14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్ల ధర సుమారు 15 లక్షలు. (చదవండి: ఆపిల్ భారీ పరిహారం చెల్లింపు)
ఒక చైనీస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం 14 ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫోన్లలో అతను నాలుగు ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్లను ఓపెన్ చేశాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఒకదాన్ని ఉపయోగిస్తూ ఉండగా, 2వ దానిని అప్పులు తీర్చడానికి, 3వ దానిని 9,500 యువాన్లకు పాన్ షాప్ దగ్గర తనఖా పెట్టాడు. చివరగా నాల్గవ మోడల్ యూనిట్ 7,000 యువాన్ల తక్కువ ధరకు డీలర్‌కు అమ్మేశాడు. అతను ఉపయోగించే ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు టాంగ్‌ను పట్టుకున్నారు. ముందు అతని వద్దనున్న 10 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత మిగతా మూడింటిని కూడా రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment