Elon Musk Did It Again.. Sells tesla Shares: టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి ఏమైందసలు?.. ఈ ప్రశ్న మీద ఆర్థిక, షేర్ మార్కెట్ నిపుణులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
►ప్రపంచంలోనే అత్యధిక ధనికుడైన ఎలన్ మస్క్.. ఈ ఒక్క వారంలోనే టెస్లాలో తన పేరిట ఉన్న 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నాడు.
►సీఈవో హోదాలో ఓ వ్యక్తి ఈ స్థాయిలో వాటాలు అమ్మేసుకోవడం ఇదే ఫస్ట్ టైం.
►తాజాగా.. శుక్రవారం 1.2 మిలియన్ షేర్లను అమ్మేశారు. వీటి విలువ 1.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది.
►టెస్లాలో తన వాటాలోని షేర్లలో 10 శాతం(17 మిలియన్ షేర్లు) అమ్మకానికి ఉంచాలనుకుంటున్నట్లు గత శనివారం ఆయన ట్వీట్ పోల్ ద్వారా ఫాలోవర్స్ ఒపినీయన్ కోరారు.
►అందుకు చాలామంది సమ్మతి తెలుపగా.. ఇప్పటివరకు 6.36 మిలియన్ షేర్లు (37 శాతం) దాకా అమ్మేశాడు. సో.. మరో పది మిలియన్ షేర్లు అమ్మేస్తే ఆయన అనుకున్నది పూర్తవుతుంది.
►ఇక ఎలన్ మస్క్ చేష్టలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 2.8 శాతం పడిపోయిన టెస్లా షేర్లు, 1,033.42 డాలర్ వద్ద ముగిసింది. అయితే ఈ పరిణామాలేవీ ‘ఆటోమేకర్ కింగ్’ అయిన టెస్లా మార్కెట్‌ను అంత ఈజీగా దెబ్బతీసేలా కనిపించడం లేదు. పైపెచ్చు ఈవీ అమ్మకాల జోరు స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రెండ్ స్పైడర్ ప్రకారం..
►ఈ అమ్మకానికి ముందు స్టాక్ ఆప్షన్స్‌తో కలిపి సుమారు 23 శాతం స్టాక్ వాటా టెస్లాలో ఉంది ఎలన్ మస్క్‌కి. అయితే సరైన కారణాలు చెప్పకుండా ఆయన చేస్తున్న పని మార్కెట్‌ను మాత్రం కుదేలు చేస్తోంది.
చదవండి: Elon Musk Shares.. కారణం ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment