బంగారం ధరలు రోజు రోజుకి మారిపోతున్నాయి. నేడు ఉన్న బంగారం ధర మరుసటి రోజు ఉండటం లేదు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర, నేడు స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా మళ్లీ ఇండియాపై నమ్మకం పెరగడంతో అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో నగల తయారీకి వాడే 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.42,450కు చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం ధర నేడు రూ.42,45గా ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాములు బంగారం ధర నేడు రూ.370 పెరిగి ప్రస్తుతం రూ.46,300 ఉంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1000 పెరిగి రూ.73000కు చేరుకుంది. అయితే తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి. కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment