వరుసగా ఐదవ రోజు బంగారం ధరలు పెరుగుదల దిశవైపు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఏకంగా 10 గ్రాముల మీద రూ. 300 నుంచి రూ. 330 వరకు పెరిగింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5365.. కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5853గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల పసిడి ధర రూ. 53650 & రూ. 58530గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు ధరలు రూ. 300 (22 క్యారెట్స్), రూ. 330 (24 క్యారెట్స్) పెరిగింది. ఇదే ధరలు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఉంటాయి.
చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5380, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5869గా ఉంది. దీని ప్రకారం 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 53800 & 58690గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 150 నుంచి రూ. 160 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు రూ. 5380 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 5686 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 53800 & రూ. 56860గా ఉంది.
ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!
వెండి ధరలు
నేడు వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో కూడా స్థిరంగా ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నాయి. ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment