దేశంలో బంగారం (Gold Price) కొత్త ధరలను నమోదు చేసింది. వరుసగా నాలుగో రోజూ ఎగిశాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 11) స్వల్పంగానే పెరిగినప్పటికీ ధరలు దిగిరాకపోవడంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. నాలుగు రోజుల్లో తులం (10 గ్రాములు) బంగారం రూ.900 పైగా పెరిగింది.
దేశంలో పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.170 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,000కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,640 వద్దకు ఎగిశాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.79,800 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,150 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.180, రూ.150 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ. 73,000 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.170 బలపడి రూ. 79,640 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద, ఢిల్లీలో రూ. 93,500 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment