దేశంలో బంగారం కొనుగోలుదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. పసిడి హ్యాట్రిక్ ధరలకు బ్రేక్ పడింది. మూడురోజులుగా వరుసగా పెరిగిన బంగారం రేట్లు నేడు (January 18) దిగివచ్చాయి. తగ్గుదల స్పల్పంగానే ఉన్నప్పటికీ ఇది కొనసాగుతుందని పసిడి ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.160 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,350కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,110 వద్దకు క్షీణించాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,260 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,500 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.160, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: ఈపీఎఫ్వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ. 74,350 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.160 క్షీణించి రూ. 81,110 వద్దకు వచ్చాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment