న్యూఢిల్లీ/న్యూయార్క్: బంగారం అంతర్జాతీయంగా కొత్త రికార్డు ధరలను తాకింది. కమోడిటీ ఫ్యూచర్స్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడయ్యే డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రాములు) ధర శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 2,611.6 డాలర్లను చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 25 డాలర్లకు పైగా ఎగసి ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల కోత అంచనాలు పసిడి పరుగులకు దోహదం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన ఫారెక్స్ నిల్వలు
దేశంలోనూ అదే తీరు...: దేశీయంగా చూస్తే ఢిల్లీలో పూర్తి స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.75,500కు చేరింది. ఒక్క జులైలో దేశీయంగా పసిడి ధర రూ.5,000 ఎగసి రూ.71,050కి చేరింది. మరోవైపు వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. కిలోకు శుక్రవారం రూ.2,000 ఎగసి రూ.89,000కు చేరింది. ముంబైలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల ధరలు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,260, రూ.1,200 చొప్పున ఎగసి వరుసగా రూ.72,610, రూ.69,150కి చేరాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.3,500 పెరిగి రూ.95,000కు ఎగసింది. మరోవైపు దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.700 లాభంతో రూ. 74,000పైన ట్రేడవుతోంది. వెండి ధర రూ. 2,400 పెరిగి రూ. 89,500 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment