బంగారం, వెండి ధరలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున రూ.200 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 21) ఏకంగా దానికి నాలుగు రెట్లు పెరిగి కొనుగోలుదారులను భయపెడుతున్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.750 పెరిగింది. దీంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది.
ఇతర ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లకు పెరిగింది.
ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.67,800 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.960 పెరిగి రూ.73,970 లకు ఎగిసింది.
భారీగా ఎగిసిన వెండి
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1400 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,500లను చేరుకుంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment