![Today Gold and Silver Price On 24 June 2024](/styles/webp/s3/article_images/2024/06/24/gold-rate_0.jpg.webp?itok=RoJAw7fs)
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్నటి రోజున స్థిరంగా కొనసాగాయి. ఈరోజు (జూన్ 24) పసిడి ధరలు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర ఈరోజు రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.
దేశంలోని ఇతర నగరాల్లో..
ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.73,380 లకు చేరింది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 తగ్గి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు దిగొచ్చింది.
బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.
చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.50 పెరిగి రూ.67,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.60 పెరిగి రూ.73,100 లకు చేరింది.
వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,200లకు దిగొచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment