న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం అక్టోబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్‌లో 55.1కు ఎగసింది. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.
ఈ ప్రాతిపదిక సేవల సూచీ వృద్ధి బాటన ఉండడం ఇది వరుసగా 15వ నెల. తమ సర్వే ప్రకారం అక్టోబర్‌లో వరుసగా ఐదవనెల సేవల రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. గడచిన మూడు సంవత్సరాల్లో సేవల రంగం ఈ స్థాయి స్పీడ్ ఇది రెండవసారని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అక్టోబర్‌లో సేవల రంగం పురోగతికి దేశీయ మార్కెట్ ప్రధాన వనరని కూడా లిమా తెలిపారు. ఇక విదేశీ అమ్మకాలు మాత్రం వరుసగా మూడవ త్రైమాసికంలో దిగువబాటన నడిచాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment