న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెపె్టంబర్‌లో ఐదు నెలల గరిష్టస్థాయిలో రూ.1,17,010 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే వసూళ్లు రూ.లక్ష కోట్ల పైబడ్డం ఇది వరుసగా మూడవనెల. 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (2021అక్టోబర్–మార్చి2022) కేంద్రానికి ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని తాజా గణాంకాలు కల్పిస్తున్నాయి. తాజా వసూళ్లు 2020 సెపె్టంబర్ వసూళ్లతో (రూ.95,480 కోట్లు) పోలి్చతే 23 శాతం అధికం. 2019 సెప్టెంబర్ వసూళ్లతో (రూ.91,916 కోట్లు) పోలి్చతే 27 శాతం అధికం. ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అటు తర్వాత ఈ స్థాయిలో (రూ.1.17 లక్షల కోట్లు) వసూళ్లు ఇదే తొలిసారి. సెపె్టంబర్ మొత్తం వసూళ్లు రూ.రూ.1,17,010 కోట్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.20,578 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.26,767 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.60,911 కోట్లు. సెస్ రూ.8,754 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment