ఈ మధ్య కంపెనీలు కరోనా మహమ్మారి కారణంగా తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. చాలా కంపెనీలు గ్రూపు హెల్త్ ఇన్స్యూరెన్స్ కింద ఉద్యోగులను కవర్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనుక ఆ ఫార్మాలిటీస్ సరిగ్గా నింపనట్లయితే మీకు అవసరమైన సమయంలో మీరు చేసుకున్న క్లెయిం చెల్లకపోవచ్చు. అందుకే బీమా ప్రయోజనాలు పొందడానికి, గ్రూపు హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిం కొరకు ఫైలింగ్ చేయడానికి ముందు మీరు క్రింది విషయాలు తెలుసుకుంటే మంచిది.
- మీరు ఉద్యోగి ఐడీ అందుకున్న తర్వాత కంపెనీ పోర్టల్ లో మీ కుటుంబం సమాచారాన్ని అప్ డేట్ చేయండి. బీమాకి సంబంధించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి లేకపోతే క్లెయిం చేయలేరు.
- మీ ఆరోగ్య బీమా పాలసీలో చేరిన తర్వాత మీకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(టీపీఏ) ఇచ్చిన కార్డును మీ యజమాని ఇస్తారు. ఒకవేళ మీరు ఆసుపత్రిలో క్యాష్ లెస్ ఫెసిలిటీని ఉపయోగించాలని అనుకున్నట్లయితే, ఈ కార్డు మీకు ఇస్తారు. మీరు ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ఈ కార్డుతో పాటు అదనంగా మీరు ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి.
- ఆరోగ్య బీమా పాలసీలో చేరేటప్పుడు పాలసీ డాక్యుమెంట్ ఎల్లప్పుడూ క్షుణ్ణంగా చదవండి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడేకంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మీరు క్షుణ్ణంగా అందులో ఏమి ఏమి కవర్ చేశారు అనేది తెలుసుకోవాలి.
- సాధారణంగా, బీమా కంపెనీలు తమ ఖాతాదారులకు నగదు రహిత సేవలను అందించడానికి ఎంపిక చేసిన ఆసుపత్రుల బృందంతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ ఆసుపత్రులను ఎంప్యానెల్డ్ నెట్ వర్క్ ఆసుపత్రులుగా పేర్కొంటారు. పాలసీ డాక్యుమెంట్ చదివేటప్పుడు, ఈ ఆసుపత్రుల జాబితా గురుంచి తెలుసుకోండి.
- బీమా చేసిన వ్యక్తి మీ భీమా నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో బీమా చేసిన వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య బీమా పాలసీ, టీపీఏ ఈ-కార్డు వివరాలను ఆసుపత్రికి అందించాలి. బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. "మీ కుటుంబం ఆరోగ్య సంరక్షణ కోసం భీమా పాలసీకి సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మీరు పాలసీ సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడంతో పాటు వాటిని సులభంగా గుర్తించే ప్రదేశంలో ఉంచడం మంచిది" అని అన్నారు.
- మీరు నెట్ వర్క్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీ వైద్య బిల్లులకు సంబంధించి అన్ని ఖర్చులు ఆసుపత్రి ద్వారా బీమా ప్రొవైడర్ లేదా టీపీఏకు వెళ్తుంది. టీపీఏ ఖర్చులను మదింపు చేసిన తర్వాత బీమా కంపెనీ మీ క్లెయిం సెటిల్ చేస్తుంది. బీమా విషయం, క్లెయిం ప్రక్రియ, ఆమోదం, సెటిల్ మెంట్ కు సంబంధించి మీ యజమాని లేదా టీపీఏ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కు మీరు తెలియజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment