![How To Send Merry Christmas 2020 Stickers On WhatsApp - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/24/Christmas-Stickers.jpg.webp?itok=eU3y-ptI)
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గత వారం కూడా ఇలాగే స్టిక్కర్ సెర్చ్ వంటి కొత్త అప్‌డేట్ తో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దింట్లో భాగంగా వాట్సాప్ చాలా స్టిక్కర్ ప్యాక్‌లను అందిస్తుంది, కానీ ఇప్పటికీ పండుగ ఆధారిత స్టిక్కర్‌ల కోసం మాత్రం థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడక తప్పడం లేదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ సందర్బంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం సృజనాత్మక లేదా అందమైన స్టిక్కర్లను పంపడానికి చాలా యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలా క్రిస్మస్ స్టిక్కర్లు పంపడం కోసం మేము ప్రయత్నించిన కొన్ని ఉత్తమమైన యాప్స్ మీకోసం అందిస్తున్నాం. వీటి ద్వారా వాట్సాప్‌లో క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ స్టిక్కర్‌లను ఎలా పంపించాలో క్రింద తెలుసుకోండి.(చదవండి: ఐఫోన్‌లో బగ్ గుర్తిస్తే రూ.11 కోట్లు)
వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపడం ఎలా?
స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ అని టైపు చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు ప్లే స్టోర్ లో మీకు చాలా యాప్స్ లభిస్తాయి. దింట్లో మీకు నచ్చిన థర్డ్ పార్టీ యాప్స్ లేదా 'క్రిస్మస్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ (వాస్టిక్కర్స్ఆప్)', 'క్రిస్మస్ స్టిక్కర్స్ ప్యాక్ 2020' డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడు యాప్స్ ఓపెన్ చేసాక మీకు చాలా క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు థాంక్స్ గివింగ్ స్టిక్కర్లు కనిపిస్తాయి.
స్టెప్ 3: వాట్సాప్‌కు స్టిక్కర్‌లను జోడించడానికి, మీరు స్టిక్కర్‌ల విండోలో ఉన్న '+' బటన్‌ను ప్రెస్ చేయండి. తరువాత స్టిక్కర్లు ఆడ్ చేయడానికి మీరు 'ADD' ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4: ఇప్పుడు మీరు వాట్సాప్ లో యాప్ లో కొత్త క్రిస్మస్ స్టిక్కర్లను చూస్తారు. ఇప్పుడు మీరు ఎవరికైతే పంపించాలో వారి చాట్ చేయండి.
స్టెప్ 5: టైపింగ్ బార్‌లో ఉన్న స్మైలీ ఐకాన్‌పై క్లిక్ చేసి స్టిక్కర్స్ ని ఎంచుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన కొత్త స్టిక్కర్స్ మీ బంధుమిత్రులకు, స్నేహితులతో షేర్ చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment