దేశంలో 19శాతం పెరిగిన గ్యాస్‌ ఉత్పత్తి | India Gas Production Jumps 19.5 Pc In June On Back Of Kg-d6 | Sakshi
Sakshi News home page

దేశంలో 19శాతం పెరిగిన గ్యాస్‌ ఉత్పత్తి

Published Fri, Jul 30 2021 8:44 AM | Last Updated on Fri, Jul 30 2021 8:45 AM

India Gas Production Jumps 19.5 Pc In June On Back Of Kg-d6 - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌ ఊతంతో జూన్‌లో నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి 19.5% వృద్ధి నమోదు చేసింది. దీంతో వార్షిక ప్రాతిపదికన వరుసగా అయిదో నెలా ఉత్పత్తి పెరిగినట్లయ్యింది.

గతేడాది జూన్‌లో 2.32 బిలియన్‌ ఘనపు మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్‌లో ఇది 2.77 బీసీఎంగా నమోదైంది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ విడుదల చేసిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement