కోల్‌కతా: భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, మాంద్యం ముంగిట పలు దేశాలు నిలుచున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడుతోందని ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు.
ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వెర్చువల్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్ర క్లిష్ట పరిస్థితిలో ప్రపంచం ఉందన్నారు.
అయినా భారత్ 2022–23లో 6.5 శాతం 7 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకునే పరిస్థితి ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను భారత్ తట్టుకుని నిలబడుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment