ఈ ఏడాది ట్రేడింగ్ చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనాలో కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే అంచనాలతో చమురు దిగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగింది. డాలర్ విలువ స్థిరంగా కొనసాగుతుండగా రూపాయి పుంజుకుంది. దీనికి తోడు మదుపర్లు ఫ్యూచర్స్ - ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ఒప్పందాలు దేశీయ స్టాక్ మార్కెట్‌లకు ఊతం ఇచ్చాయి.
వెరసి శుక్రవారం ఉదయం 10 .30 గంటల సమయానికి దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు లాభ పడి 61265 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 18233 వద్ద ట్రేడింగ్‌ను కంటిన్యూ చేస్తుంది.
హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్‌జీసీ, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎథేర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఏసియేషన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment