ఇన్ఫోసిస్‌: రూ. 308 కోట్ల డీల్!‌  | Infosys To Buy US Based Kaleidoscope Innovation | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ చేతికి అమెరికన్‌ సంస్థ

Published Fri, Sep 4 2020 8:32 AM | Last Updated on Fri, Sep 4 2020 11:55 AM

Infosys To Buy US Based Kaleidoscope Innovation - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా అమెరికాకు చెందిన ప్రోడక్ట్‌ డిజైన్, డెవలప్‌మెంట్‌ సంస్థ కెలీడోస్కోప్‌ ఇన్నోవేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్‌ విలువ దాదాపు సుమారు 42 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 308 కోట్లు) దాకా ఉంటుందని పేర్కొంది. మైక్రోసర్జికల్‌ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే సాధనాలు మొదలైనవి కెలీడోస్కోప్‌ రూపొందిస్తోంది. 2019 డిసెంబర్‌ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 20.6 మిలియన్‌ డాలర్లు. తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్‌ నోవా హోల్డింగ్స్‌ ద్వారా కెలీడోస్కోప్‌ కొనుగోలు జరుగుతుందని ఇన్ఫీ పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పూర్తి కాగలదని తెలిపింది.(చదవండి: ఇన్ఫోసిస్‌‌తో జర్మనీ కంపెనీ జోడీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement