ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.
ముంబై ప్రాంతంలోని భయాందర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.
కంచన్ పాయ్ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.
అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment