Mumbai woman
-
రెండు సార్లు ‘మరణం’!! రూ.1.1 కోట్ల కోసం మహిళ మోసం
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.ముంబై ప్రాంతంలోని భయాందర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.కంచన్ పాయ్ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. -
నా మనశ్శాంతి పోయింది పోలీసులే వెతకాలి
‘నా మనశ్శాంతి పోయింది. పోలీసులే వెతికి తేవాలి. స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేస్తా’ అని ఒక ముంబై మహిళ సరదాగా పెట్టిన ‘ఎక్స్’ పోస్టుకు పోలీసులు సినిమా భాషలో సరదాగా సమాధానం చెప్పారు. అది కాస్తా వైరల్ అయ్యి పోలీసులను మెచ్చుకున్నవారూ... మీ పంచ్‌లు తర్వాత... ముందు మా కేసులు చూడండి అని మొత్తుకున్నవారూ ఉన్నారు. ఈ సరదా ఉదంతం ఎట్టిదనిన... ‘పోలీస్ స్టేషన్ జా రహీ హూ... సుకున్ ఖోగయాహై మేరా’ (నా మనశ్శాంతి పోయింది... వెతికి పెట్టమని కోరేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నా) అంటూ అక్టోబర్ 31న వేదిక ఆర్య అనే మహిళ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టింది. మనశ్శాంతిగా లేను అని చెప్పడానికి ఆమె చేసిన సరదా ప్రయోగం అది. ముంబై పోలీసులు ఆమెకు సరదాగా సినిమా భాషలో సమాధానం చెప్పారు. వారు హిందీ సినిమాల పేర్లతో చెప్పినా... తెలుగు సినిమాలకు అన్వయిస్తే ఆ సమాధానం ఇలా ఉండొచ్చు... ‘మన మనసు ‘శాంతి నివాసం’లా ఉండాలని ప్రతి ఒక్కరూ ‘ఆశ ఆశ ఆశ’ పడతారు. ‘అన్వేషణ’ సాగిస్తారు. ‘ఇది (మీ ఒక్కరి) కథ కాదు’. మీ ‘గుప్పెడు మనసే’ ఏదో ఒకనాటికి దీనిని కనుగొనగలదు. అయినా సరే మా సాయం కావాలంటే అది మా ‘కర్తవ్యం’. మీరు ఎప్పుడొచ్చినా ‘ఆవిడే శ్యామలా’ అని గుర్తించగలం’... ఇలాంటి జవాబు చూసి పోలీసు వారిలో ఇంత పంచ్ ఉందా అని చాలా మంది మెచ్చుకున్నారు. అలాగే రకరకాల జవాబులూ వచ్చాయి. ‘మనశ్శాంతి దొరికితే మాక్కూడా చెప్పండి’ అని ఒకరు, ‘షాపింగ్ చెయ్ దొరుకుతుంది’ అని ఒకరు, ‘మనశ్శాంతి స్నేహితుల దగ్గర ఉంటుంది’ అని ఒకరు ‘రాధాకృష్ణ మందిరానికి పో’ అని ఒకరు వేదిక ఆర్యకు సలహాలు ఇస్తే మరి కొందరు పోలీసులకు చివాట్లేశారు. ‘మా కేసు సంగతి చూడండి ముందు’ అని ఒకరు, ‘ఫేస్బుక్లో వీడు వేధిస్తున్నాడు.. వీడి సంగతి చూడండి ముందు’ అని మరొకరు రిప్లైలు పెట్టారు. ‘ఉన్న మనశ్శాంతి లాక్కోకపోతే అదే పదివేలు’ అని ముక్తాయించారొకరు. -
చదువు.. సంస్కారం.. పర్యావరణం
పదో తరగతి చదివే పిల్లలు... స్కూలు, ట్యూషన్లు అంటూ బిజీబిజీగా ఉంటారు. ఆఖరి పరీక్షలు పూర్తయ్యేవరకు చదువు తప్ప మరో ధ్యాస ఉండదు వీరికి. అలాంటిది లితిషా బగాడియా చదువుతోపాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను నిర్మూలిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. గత రెండేళ్లుగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రకృతి సంరక్షణకు కృషిచేస్తోన్న లితిషాను ‘ద ప్రిన్సెస్ డయానా క్లైమెట్ యాక్షన్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో పిల్లలకు చదువు, సంస్కారంతోపాటు పర్యావరణ స్పృహ కూడా ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది లితిషా. ముంబైకు చెందిన లితిషాకు... చెత్తపేరుకుపోయిన నగరాల జాబితాలో ముంబై కూడా ఉండడం నచ్చలేదు. దీంతో నగరాన్ని శుభ్రం చేయాలనుకుంది. అదే విషయాన్ని తన స్నేహితురాలు సియా జోషికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఎన్జీవోని ఏర్పాటు చేసి ముంబైని క్లీన్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఉండడంతో బయటకు రావడం కుదరలేదు. దీంతో 2021 ఆగస్టు 31న ‘ఐకా’ ఫౌండేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించారు. ఐకా ద్వారా... పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ, టపాసులు కాల్చడం, నీటì వృథా... వంటి అంశాలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించేవారు. ఇది నచ్చిన కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడంతో వారితో కలిసి చెత్తను శుభ్రం చేయడం మొదలు పెట్టారు. వీరికి మరికొంతమంది తోడవడంతో అంతా సమూహంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తరించారు. ► పూల నుంచి పెర్ఫ్యూమ్స్ ప్రాజెక్ట్ ‘అవిఘ్న’ పేరుతో... వినాయక చవితి వేడుకల్లో మండపాల దగ్గర చల్లే పూలు, ఇతర పండుగల్లో వాడేసిన పూలను, నిమజ్జనం తరువాత మిగిలిపోయే ఇనుము వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఈ పూలను పెర్ఫ్యూమ్స్గా, ఎరువులుగా మార్చడం వల్ల నిరుపేదలకు ఆదాయం కూడా వస్తోంది. గణేష ఉత్సవాల్లో మూడువందల కేజీలకుపైగా పూల వ్యర్థాలను సేకరించి ‘మోబి ట్రాష్’ అనే స్టార్టప్‌కు అందించారు. ఈ స్టార్టప్ పూలను గిరిజన, మురికివాడల్లోని నిరుపేదలకు ఇచ్చి అగరు బత్తీలు, రంగులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తోంది. దీనిద్వారా నగరంలో చెత్త శుభ్రం అవడమేగాక, పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ► ఈ వేస్ట్‌తోపాటు బీచ్‌క్లీనింగ్ వాడిపడేసిన ల్యాప్టాప్స్, ఫోన్ ఛార్జర్లు, ఇయర్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను కూడా సేకరించి ఈ వేస్ట్ రీ సైక్లింగ్ సెంటర్లకు చేరవేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ‘ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ నిర్వహించి వేస్ట్ సేకరిస్తున్నారు. ‘బీచ్క్లీన్ – అప్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీచ్‌లో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను ‘శక్తి ప్లాస్టిక్స్’ కంపెనీకి ఇస్తున్నారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవేగాక ఏడోతరగతి లోపు పిల్లలకు వర్క్‌షాప్స్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. హోలీ, దీపావళి సమయాల్లో ఇకోఫ్రెండ్లీ సంబరాలు జరుపుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ► చదువుతూనే... ఇంకా జీవితంలో స్థిరపడేంతగా చదువుకోలేదు. అయినా ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కాలేజీ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ముంబైని క్లీన్ చేయడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో.. భవిష్యత్‌లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఈ చిచ్చరపిడుగులు చెబుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇలాంటి బాలలు మరింతమంది తయారైతే మన దేశ భవిష్యత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది. ‘‘ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్నేహితురాలు, ఐకా ఫౌండేషన్ సహవ్యవస్థాపకురాలు సియా జోషి నా వెన్నంటే ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ గౌరవం దక్కింది. అందుకే మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అందరిలో అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడతాము’’ అని లితిషా బగాడియా చెబుతోంది. లితిషా బగాడియా -
Aspire For Her: ఉద్యోగం చేసి చూడు
‘ఇల్లు కట్టి చూడు’ అన్నారుగానీ ‘ఉద్యోగం చేసి చూడు’ అనలేదు. అనకపోతేనేం... ఉద్యోగం చేయడం ఆషామాషీ విషయం కాదు. ఉద్యోగం అనేది కేవలం ఉపాధి మాత్రమే కాదు. మనలోని శక్తులను సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడం. ఈ ఎరుకతోనే ‘ఎస్పైర్ ఫర్ హర్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది మథురదాస్ గుప్త. తాజాగా... టెక్ దిగ్గజం గూగుల్ వారి ‘గూగుల్ ఫర్ స్టార్టప్’ కార్యక్రమానికి ఎంపికైన స్టార్టప్ ఫౌండర్లలో దాస్ ఒకరు... రకరకాల కారణాల వల్ల మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. కొందరు ‘ఉద్యోగం మా పని కాదు’ అనుకుంటున్నారు. కొందరికి ఉద్యోగం చేయాలని ఉంటుంది. కాని దారి ఏమిటో తెలియదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ‘మహిళల ఆర్థిక స్వాతంత్య్రం’ లక్ష్యంగా ‘ఎస్పైర్ ఫర్ హర్’ (ఎఎఫ్హెచ్) స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మ«థురదాస్ గుప్త. ఇరవై అయిదు సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో పని చేసిన దాస్, అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా ఇంటిపట్టునే ఉంటున్న ఎంతోమంది మహిళలను చూసింది. ‘మీరు ఎందుకు ఉద్యోగం చేయకూడదు?’ అని అడిగితే ‘పిల్లల్ని ఎవరు చూసుకుంటారు?’ ‘ఇంటిపనులు ఎవరు చేస్తారు?’ ‘మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా. మళ్లీ నేను ఎందుకు?’... ఇలా రకరకాల మాటలు వినిపించేవి. మరోవైపు ఉద్యోగాలలో స్త్రీ పురుషులకు మధ్య ఉన్న భారీ అంతరం బాధ పెట్టేది. ‘భద్రమైన ఉద్యోగాన్ని వదిలి రిస్క్ చేస్తున్నావు... అని హెచ్చరించారు చాలామంది. ‘‘అయితే నేను డబ్బుల కోసం కాదు ఒక మంచిపని కోసం ఈ స్టార్టప్ మొదలుపెట్టాను. మంచిపని చేస్తున్నాననే భావన నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించింది’’ అంటుంది మథుర. ‘ఏఎఫ్హెచ్’లో లక్షా యాభైవేలమంది సభ్యులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది నిపుణులు, సంస్థల మద్దతు ఉంది. ఆయా రంగాల నిపుణుల ద్వారా సభ్యులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ ఇప్పిస్తోంది ఎఎఫ్హెచ్. ‘ఏఎఫ్హెచ్’ సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలంటే కోల్‌కతాకు చెందిన ఆద్రిజ నుంచి మొదలు బిజోయెత మైత్ర వరకు ఎంతమంది గురించి అయినా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు చనిపోవడంతో కుంగుబాటు బారిన పడింది అద్రిజ. ఒకరోజు టీచర్ దగ్గరకు వెళ్లి ‘నేను బోర్డ్ ఎగ్జామ్స్ కూడా పాస్ కాలేను’ అన్నది. చదువులో చురుగ్గా ఉండే అమ్మాయి, భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్న అమ్మాయి ‘ఇక నేను ఏమీ చేయలేను’ అంటూ దీనంగా నిల్చోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ‘ఎఎఫ్హెచ్’ బాధ్యులకు పరిచయం చేశారు. ‘ఏఎఫ్హెచ్’లోకి అడుగుపెట్టడంతో ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది. ‘కష్టకాలంలో నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని నింపారు’ అని ఉత్సాహంగా చెబుతుంది ఆద్రిజ. కోవిడ్ కాలంలో బిజోయెత మైత్ర తన భర్తను కోల్పోయింది. ఇల్లు గడవడానికి ఆయన సంపాదనే ఆధారం. తానేమో ఎప్పుడూ ఉద్యోగం చేసింది లేదు. కూతురి గురించి ఆలోచిస్తూ మరింత బాధకు గురయ్యేది. ‘అదేపనిగా దిగులు పడడం తప్ప ఏం చేయాలో తెలియని రోజుల్లో, ఒకరి సలహా మేరకు ఏఎఫ్హెచ్ బాధ్యులను కలిశాను. వారు నాలో ఎంతో ధైర్యం నింపారు. నేను ఒంటరిని అనే బాధ దూరమై, నా వెనక పెద్ద కుటుంబం ఉందనే మానసిక బలం వచ్చింది’ అంటున్న మైత్ర ప్రస్తుతం ఎంటర్ప్రెన్యూర్, వెల్నెస్ అడ్వైజర్‌గా రాణిస్తోంది. ‘ఉద్యోగం చేయాలనే కోరిక బలంగా ఉన్నా, నేను చదివిన చదువుకు ఏ ఉద్యోగం వస్తుంది అనే అపనమ్మకం ఉండేది. అయితే ఏఎఫ్హెచ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నన్ను బాగా అర్థం చేసుకున్న తరువాత, ‘నీలో ఈ ప్రతిభ ఉంది, ఈ రంగంలో నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది’ అని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో ఉండడానికి ఏఎఫ్హెచ్ కారణం’ అంటుంది ముంబైకి చెందిన 29 సంవత్సరాల వినీత. ‘ఎస్పైర్ ఫర్ హర్’ అద్భుత విజయం సాధించింది అని వీరి మాటలు చెప్పకనే చెబుతున్నాయి. -
ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళ
-
ఆమె అలా చెప్పకూడదని తెలియక...
ముంబై : ఇటీవల ఆన్లైన్ మోసాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో వింటూనే ఉన్నాం. బ్యాంకు అధికారులమంటూ కాల్ చేస్తున్న వారికి, అకౌంట్ వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ వంటి కోడ్లు చెప్పకూడదని పలుమార్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ముంబైలో ఓ మహిళ తన అమాయకత్వంతో సైబర్ నేరగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న అని పోలీసులు ప్రశ్నించగా.. అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదంటూ బిక్కమొహం వేసేసింది. తనకసలు ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి అసలేం తెలియదని చెప్పింది. నావీముంబైలోని నెరూల్‌కు చెందిన తస్నీమ్ ముజకర్ మోడక్ అనే మహిళ తనకున్న జాతీయ బ్యాంకులో ఇటీవలే 7.20 లక్షల రూపాయలు క్రెడిట్‌చేసింది. మే 17న తస్నీమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తను ఎస్బీఐ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్ని సాంకేతిక సమస్యలతో మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందని చెప్పాడు. అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాలన్నాడు. అతడు చెప్పినట్టే చేసిన తస్నీమ్ అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. వారం వ్యవధిలో అలా 28 సార్లు ఆ ఆన్లైన్ మోసగాడికి తన ఓటీపీ చెప్పింది. ఇలా ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98, 973 కాజేశాడు. పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన తస్నీమ్‌కు తన అకౌంట్ నుంచి రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసింది. దీంతో వెంటనే నెరూల్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ నేరగాడు మొత్తం మూడు సిమ్ కార్డులతో తస్నీమ్‌కు ఫోన్ చేసి, ఓటీపీ వివరాలు రాబట్టినట్టు తెలిపారు. ముంబై, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, బెంగళూరుల నుంచి ఈ లావాదేవీలు సాగించినట్టు పేర్కొన్నారు. 16 అంకెల డెబిట్ కార్డు నెంబర్, కార్డుపై ప్రింట్ అయిన పేరు, 3 అంకెల సీవీవీ నెంబర్ అన్నీ చాలా రహస్యంగా ఉంచుకోవాలని ఆమెకు పోలీసులు చెప్పారు. తన భర్త కువైట్‌లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. -
రెప్పపాటులో తప్పిన ప్రాణహాని