కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్లలో బుల్ రక్కేలేస్తూ పరుగులు తీస్తోంది. బుల్ పరుగులతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు. 2022 తొలి రెండు రోజుల్లోనే లక్షల కోట్లను మదుపరులు వెనకేశారు.
రెండు రోజుల్లో రూ. 5.36 లక్షల కోట్లు..!
ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు కొత్త ఏడాదిలో బుల్ పరుగులపై ఎలాంటి ప్రభావాలు చూపలేదు. సెన్సెక్స్ 2022 మొదటి రోజున ట్రేడింగ్‌లో ఏకంగా 929.40 పాయింట్లు లాభం పొంది 59,183.22 వద్ద స్థిరపడింది. అదే దూకుడు మంగళవారం రోజు కూడా కొనసాగింది. రెండో రోజు కూడా సెన్సెక్స్ 672.71 పాయింట్లు పెరిగి 59,855.93 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 179. 60 పాయింట్లు పెరిగి 17, 805. 30 వద్ద స్ధిర పడింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో లిస్ట్ ఐనా కంపెనీల మార్కెట్ విలువ కేవలం రెండు రోజుల్లోనే రూ. 5.36 లక్షల కోట్లు పెరిగి ఆయా ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పొందారు.
కాసుల కురిపించిన షేర్లు ఇవే..!
కేవలం రెండు రోజుల్లోనే ఆయా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఎన్‌టీపీసీ, ఒఎన్‌జీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, టైటాన్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి.
చదవండి: ఇన్వెస్టర్లకు కాసులవర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..!
Comments
Please login to add a commentAdd a comment