Multibagger stocks: గత ఏడాది కాలంలో చాలా కంపెనీల స్టాక్ ధరలు తార జువ్వలు లాగా దూసుకెళ్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట పండుతుంది. ఒక ఏడాది కాలంలో 50 శాతం లేదా 100 శాతం లాభాలు ఇచ్చే కంపెనీలను చూశాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీ స్టాక్ ధర ఏడాదిలో 2500 శాతానికి పైగా పెరిగింది. గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు 1000 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లలో జెఐటిఎఫ్ ఇన్ ఫ్రాలాజిస్టిక్స్ షేర్లు ఒకటి.
జెఐటీఎఫ్ ఇన్ ఫ్రాలాజిస్టిక్స్
ఈ మల్టీబ్యాగర్ జెఐటిఎఫ్ ఇన్ ఫ్రాలాజిస్టిక్స్ షేర్ల ధరలు గత కొన్ని నెలలుగా భారీ లాభాలను అందిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 20న రూ.6.75గా ఉన్న షేర్ ధర నేడు రూ.179.60గా ఉంది. ఈ ఏడాది కాలంలో కంపెనీ షేర్ విలువ 25 రేట్లకు పైగా పెరిగింది. అంటే, గత ఏడాది నవంబర్ 20న లక్ష రూపాయలు విలువ గల ఈ కంపెనీ షేర్లు కొన్నవారికి నేడు రూ.25 లక్షలు లాభం వచ్చింది. అలాగే, 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ₹లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువఈ రోజు ₹16 లక్షలుగా మారేది. అయితే, గత ఏడాది కాలంలో స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టిన వారి చాలా మంది జాతకాలు మారిపోతున్నాయి. ఏడాదిలో కోటీశ్వరులు అయిపోతున్నారు, అలాగే మరికొందరు బికారి కూడా అవుతున్నారు.
(చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!)
Comments
Please login to add a commentAdd a comment