తగ్గేదేలే! కార్లధరల్ని పెంచడంలో పోటాపోటీ..ఇప్పుడు మరోసారి! | Maruti Suzuki Hikes Car Prices | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే! కార్లధరల్ని పెంచడంలో పోటాపోటీ..ఇప్పుడు మరోసారి!

Published Sat, Jan 15 2022 6:36 PM | Last Updated on Sat, Jan 15 2022 8:49 PM

Maruti Suzuki Hikes Car Prices - Sakshi

దేశీయ వాహనదారులకు మారుతీ సుజుకి మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే ఏడాది 3సార్లు కార్ల ధరల్నిపెంచిన మారుతీ సంస్థ ముడిసరకు ధరలతో పాటు ఇతర కారణాల వల్ల కార్ల ధరల్ని పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో మారుతి 13నెలల కాలంలో 4సార్లు కార్ల ధరల్ని పెంచినట్లైంది. 

అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా అన్నీ మోడళ్ల కార్ల ధరల్ని 4.3 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ తన మోడళ్లలో ధరలను 0.1 శాతం నుండి 4.3 శాతం వరకు పెంచింది."మోడళ్లలో ఎక్స్-షోరూమ్ ధరలలో (ఢిల్లీ) వెయిటెడ్ యావరేజ్ ధర పెరుగుదల 1.7 శాతంగా ఉంది. కొత్త ధరలు నేటి నుండి అమల్లోకి వస్తాయని ఆటో మేజర్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు.

కాగా, గత ఏడాది కాలంగా కార్ల తయారీకి ఉపయోగించే స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ గత నెలలో పేర్కొంది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం మరియు సెప్టెంబర్‌లో 1.9 శాతం పెంచింది.

చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు భారీ షాక్‌, రూపాయి ధర కాస్త రూ.5 వేలకు పెరిగింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement