న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా ఇన్వెస్ట్ ఇండియాతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇన్వెస్ట్ ఇండియాలో భాగమైన యాక్సెలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్ (అగ్ని మిషన్)తో మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కలిసి పనిచేస్తుంది. ఇందులో భాగంగా 11 అంకుర సంస్థలు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ కార్యక్రమంలో చేరాయి. వ్యవసాయం, రక్షణ, ఇ–మొబిలిటీ, వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన యాంపిల్‌ఎర్త్ ప్యాకేజింగ్ అండ్ సిస్టమ్స్, అరిష్టి సైబర్‌టెక్, డేబెస్ట్ రీసెర్చ్ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ ప్రోగ్రాం కోసం ఎంపికైన అంకుర సంస్థలకు మైక్రోసాఫ్ట్ సాంకేతికతలు (అజూర్, గిట్‌హబ్, ఎం365 మొదలైనవి) అందుబాటులో ఉంటాయి. స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికలను మెరుగుపర్చుకోవడం, విస్తరించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment