న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశం చైనాను అధిగమించింది. దాదాపు 21 ట్రిలియన్ డాలర్ల అసెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 85 సావరిన్ వెల్త్ ఫండ్‌లు, 57 సెంట్రల్ బ్యాంకులు, 142 చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రపంచ పెట్టుబడి నిర్వహణ సంస్థ ఇన్వెస్కో వెల్లడించిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపించింది.
‘‘ఇన్వెస్కో గ్లోబల్ సావరిన్ అసెట్ మేనేజ్‌మెంట్ స్టడీ’’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
♦ భారతదేశలో మెరుగైన వ్యాపార పరిస్థితులు, రాజకీయ స్థిరత్వం, అనుకూలమైన జనాభా, నియంత్రణ పరమైన సానుకూలతలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సంస్థలు, ఫండ్స్‌కు స్నేహపూర్వక వాతావరణం కలి్పస్తున్నాయి.
♦ ద్రవ్యోల్బణం– వాస్తవ వడ్డీ రేట్ల పరిస్థితుల ప్రాతిపదికన పెట్టుబడిదారులు తరచూ తమ పోర్ట్‌ఫోలియోలను రీకాలిబ్రేట్ (పునఃసమీక్ష, మదింపు) చేసుకుంటున్నారు.
♦ ‘‘మాకు భారతదేశం లేదా చైనాతో తగినంత పెట్టుబడులు ఏమీ లేవు. అయితే, వ్యాపార, రాజకీయ స్థిరత్వం పరంగా భారతదేశం ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లు కనబడుతోంది. రెగ్యులేటరీ వ్యవస్థల పటిష్టంగా ఉండడం సావరిన్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న అంశం’’ అని మధ్యప్రాచ్యంలో ఉన్న ఒక సావరిన్ ఫండ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
♦ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పెరిగిన విదేశీ కార్పొరేట్ పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతున్న మెక్సికో, బ్రెజిల్‌తో సహా అనేక దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటోంది.
♦ కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి, దేశీయ కరెన్సీల పటిష్టతలకు దోహదపడుతున్న అంశం ఇది.
♦ పెట్టుబడులను పెంచడానికి ఆకర్షణీయమైన వర్ధమాన మార్కెట్‌లలో ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియాలు ఉన్నాయి.
♦ ద్రవ్యోల్బణం సవాళ్లు భారత్‌సహా భౌగోళికంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడి, వర్థమాన దేశాల మార్కెట్ బాండ్లు పెట్టుబడులకు తగిన సాధనాలుగా భావించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment