
ముంబై: వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కొత్త స్ట్రైయిన్ వైరస్ వ్యాప్తి వార్తలే ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిమాణాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఆటో కంపెనీలు డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. అలాగే డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు (డిసెంబర్ 31న) తేది కూడా ఉంది. కాగా, క్రిస్మస్, కొత్త ఏడాది ప్రారంభంతో ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల పరిమాణం తగ్గొచ్చు.
జనవరి 1న లిస్టింగ్..!?
ఇటీవలే పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ షేర్లు జనవరి 1న ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 21న ప్రారంభమై, డిసెంబర్ 23తో ముగిసిన ఈ ఇష్యూకు 15 రెట్ల స్పందన లభించిన సంగతి తెలిసిందే.
డిసెంబర్‌లో భారీ పెట్టుబడులు..
దేశీయ స్టాక్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో (డిసెంబర్ 1 నుంచి 24వ తేదీ వరకు) రూ.60,094 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment