ముంబై: గత కొద్ది రోజుల క్రితం వరకు మంచి జోరు మీద ఉన్న బుల్.. బేర్ కొట్టిన ఒకే దెబ్బకు కిందకు పడిపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే తీరును కొనసాగించింది. అంతర్జాతీయ పరిణామాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అరబ్ దేశాల్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు, క్రూడ్‌ఆయిల్ ధర పెంపు, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు దేశీయ ఇన్వెస్టర్ల నడ్డి విరిచాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి.
చివరకు, సెన్సెక్స్ 656.04 పాయింట్లు (1.08%) క్షీణించి 60,098.82 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 174.60 పాయింట్లు(0.96%) క్షీణించి 17,938.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం వీలువ రూ.74.43 వద్ద ఉంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో షేర్లు ఎక్కువగా నష్టపోతే.. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, హిండాల్కో, యుపీఎల్ షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. ఆటో, మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్ రంగాలలో సూచీలు లాభాల్లో ముగిస్తే.. బ్యాంకు, ఎఫ్ఎంసిజి, ఐటీ, ఫార్మా, రియాల్టీ రంగాలలో అమ్మకాలు కనిపించాయి. నేడు, బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పడిపోయింది.
(చదవండి: 5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..!)
Comments
Please login to add a commentAdd a comment