వ్యవసాయం, రక్షణ, క్రీడలు ఇలా అనేక రంగాల్లో రాబోయే రోజుల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించబోతున్నాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. న్యూ ఢిల్లీలో జరుగుతున్న భారత్ డ్రోన్ మహోత్సవ్ వేడుకలను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మే 27, 28 తేదీల్లో ఈ వేడుకల్లో 16 వేల మంది డెలగేట్స్ పాల్గొంటున్నారు. డెబ్బైకి పైగా వచ్చిన ఎగ్జిబిటర్లు తమ డ్రోన్ల సామర్థ్యాలు, నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు.
డ్రోన్ల సెక్టార్లో ప్రస్తుతం కనిపిస్తున ఆశావహ పరిస్థితులను చూస్తోంటే.. భవిష్యత్తులో ప్రపంచానికి భారత్ డ్రోన్ హబ్‌గా మారుతుందన్నారు ప్రధాని మోదీ. రాబోయే రోజుల్లో అనేక ఉద్యోగాలు ఈ సెక్టార్లో లభిస్తాయంటూ మోడీ నమ్మకం వ్యక్తం చేశారు. డోన్ల ఉపయోగంతో పరిస్థితులు ఎలా మారిపోతాయో చెప్పేందుకు పీఎం సమిత్వ యోజనా పథకం ఓ ఉదాహారణ అన్నారు. ఈ పథకం ద్వారా ఇండియాలో ఉన్న ప్రాపర్టీలన్నింటీని డిజిటల్ మ్యాపింగ్ చేయగలిగామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 67 లక్షల డిజిటల్ ప్రాపర్టీ కాపీలను ప్రజలకు అందించామన్నారు. త్వరలోనే డిఫెన్స్, విపత్తు నిర్వాహాణ విభాగాల్లో డ్రోన్ల వాడకం పెంచబోతున్నట్టు ప్రధాని వెల్లడించారు.
చదవండి: ఎలన్ మస్క్ కొంప ముంచే పనిలో చైనా.. ఏకంగా శాటిలైట్‌లను నాశనం చేస్తామని ప్రకటన!
Comments
Please login to add a commentAdd a comment