ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. భారత్‌తో సహా అన్ని ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. గడిచిన రెండు సంవత్సరాలు కోట్లాదిమందికి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి.లక్షలాదిమంది ఈ మహమ్మారికి బలి అయ్యారు.అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. అనేక రంగాలు భారీగా దెబ్బ తిన్నాయి. కోవిడ్-19 తెచ్చిన పరిస్థితులు ఇంకా కొన్ని కంపెనీలను వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రపంచదేశాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేగంగా పుంజుకున్నప్పటికీ...కరోనా వైరస్ అంతే వేగంతో వేరియంట్లను మార్చుకుంటుంది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను భయపెడుతోంది. పలు దేశాలు మరొకసారి లాక్‌డౌన్‌ను విధించేందుకు సిద్దమైన్నాయి. ఇక భారత్‌లో పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలను అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి.
కోవిడ్-19తో రెండు సంవత్సరాలు..!
రెండు సంవత్సరాలు కోవిడ్-19తో గడిచిపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ అవే తరహా పరిస్థితులు వచ్చే నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవాల్సి రావడంపై దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా స్పందించారు. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మనలో చాలామందికి అత్యంత కష్టంగా గడిచిందని అభిప్రాయపడ్డారు.
కోవిడ్-19తో ఆయా వ్యక్తుల జీవితాల్లో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారని అన్నారు. కొత్త ఏడాది, ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ ఆసక్తికర పోస్ట్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. కొత్త ఏడాదిలో దేశ ప్రజలు అందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని రతన్ టాటా పేర్కొన్నారు. రతన్ టాటా చేసిన పోస్ట్ కేవలం ఐదు గంటల్లో 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు రతన్‌టాటాను ‘అన్మోల్ రతన్ ఆఫ్ ఇండియా’ అంటూ కామెంట్లు చేస్తూ కీర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment