రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంవద్దే కొనసాగనుంది. ఈ బాటలో రివర్స్ రెపో సైతం 3.35 శాతంగా అమలుకానుంది. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా కొనసాగనుంది. ఆర్థిక వ్యవస్థకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఆర్‌బీఐ రెపో రేటులో 1.15 శాతంమేర కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాజా రుణాలపై దేశీ బ్యాంకులు సైతం 0.72-0.8 శాతం మధ్య వడ్డీ రేట్లను తగ్గించాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment