రెపో, రివర్స్ రెపో యథాతధం
ముంబయి: ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మంగళవారం మూడవ త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్బీయై ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీయై గవర్నర్ రంగరాజన్ ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో రేపోరేటు 7.25శాతం, రివర్స్ రేపోరేటు 6.25శాతం, నగదు నిలువ 4.5 శాతం ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగనున్నాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో నిర్దేశిత 5.4 శాతం స్థాయిలో ఉండడం.. టోకు ద్రవ్యోల్బణం కొన్ని నెలలుగా అసలు పెరక్కపోగా ..పారిశ్రామిక ఉత్పత్తి మందగమన ధోరణి, బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు తగిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో మరోసారి రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉంది. మరోవైపు వడ్డీరేట్లను తగ్గించొద్దని పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఈనేపథ్యలో ప్రస్తుత ఆర్బీయై పరపతి విధాన రెవ్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా మంగళవారం ఆర్‌బీఐ ‘రెపో’ రేటుపై తీసుకునే నిర్ణయంపై మార్కెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.