Keeps
-
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్‌సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్‌కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్‌పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్‌పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
యథాతథంగా జపాన్ కీలక వడ్డీరేట్లు
-
యథాతథంగా జపాన్ కీలక వడ్డీరేట్లు
టోక్యో: జపాన్ కేంద్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీఓజే) కీలక వడ్డీరేట్ల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న మైనస్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకనుగుణంగానే -0.1శాతం స్వల్ప-కాల వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది. దీంతోపాటుగా 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు గాను స్థిరమైన విధానం అమలుతో పాటు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని మరింత పొడిగించింది. విదేశాలనుంచి డిమాండ్ క్షీణత తోపాటు, ప్రజల ఆర్థిక కార్యకలాపాల బలహీనత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ కొనసాగుతుందనిపేర్కొంది. ప్రస్తుత మందకొడితనం స్వల్పంగా మెరుగుపడి ఎగుమతులు, వినియోగం మధ్యస్తంగా పెరగనుందని అంచనావేసింది అలాగే ప్రస్తుతం అమలు చేస్తున్న స్టిములస్ ప్యాకేజీకి అదనపు సహాయక ప్యాకేజీలను ప్రకటించలేదు. దీంతో సెక్యూరిటీల కొనుగోలు ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు 800 బిలియన్ యెన్ల (625 బిలియన్ పౌండ్లు)నిధులను యథాతథంగా ఉండనున్నాయి. గత పాలసీ రివ్యూలో దాదాపు 10 సంవత్సరాల దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడానికి, తద్వారా సున్నా శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్నిఅధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రెపో, రివర్స్ రెపో యథాతధం
ముంబయి: ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మంగళవారం మూడవ త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్బీయై ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీయై గవర్నర్ రంగరాజన్ ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో రేపోరేటు 7.25శాతం, రివర్స్ రేపోరేటు 6.25శాతం, నగదు నిలువ 4.5 శాతం ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగనున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో నిర్దేశిత 5.4 శాతం స్థాయిలో ఉండడం.. టోకు ద్రవ్యోల్బణం కొన్ని నెలలుగా అసలు పెరక్కపోగా ..పారిశ్రామిక ఉత్పత్తి మందగమన ధోరణి, బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు తగిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో మరోసారి రెపో రేటును ఆర్బీఐ తగ్గించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉంది. మరోవైపు వడ్డీరేట్లను తగ్గించొద్దని పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఈనేపథ్యలో ప్రస్తుత ఆర్బీయై పరపతి విధాన రెవ్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా మంగళవారం ఆర్బీఐ ‘రెపో’ రేటుపై తీసుకునే నిర్ణయంపై మార్కెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.