Investment Tips On Elss Scheme
స్మాల్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా?
మిడ్‌క్యాప్‌లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్‌క్యాప్ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్ పథకాలు ప్రధానంగా మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే విధంగా స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్‌క్యాప్ ఫండ్ అయితే ఎక్కువగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లోనూ ఎక్స్‌పోజర్ తీసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా టాప్ –100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా, తదుపరి 150 కంపెనీలను మిడ్‌క్యాప్‌గా, మిగిలిన కంపెనీలను స్మాల్‌క్యాప్ కంపెనీలుగా సెబీ నిర్వచించింది.
ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి. అయితే, 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీలన్నీ ఎల్లప్పుడూ మిడ్‌క్యాప్‌లోనే ఉంటాయని కాదు అర్థం. మార్కెట్ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్ లేదా స్మాల్ క్యాప్ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్‌క్యాప్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అవి మిడ్‌క్యాప్‌లోనే లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు 101 నుంచి 125 వరకు ఉన్న కంపెనీలను ఎంచుకుంటాయి. అవి పేరుకు మిడ్‌క్యాప్ కంపెనీలుగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి.
ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల నుంచి 10–20 ఏళ్ల కాలంలో ఎంత మేర రాబడులు ఆశించొచ్చు..?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) పథకాలకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 30 ఏళ్ల రాబడులు పరిశీలించినా లేక ఈ పథకాలకు సంబంధించి 20 ఏళ్ల కాల రోలింగ్ రాబడులను గమనించొచ్చు. ఈ పథకాల్లో రాబడులు సగటున 15–20 శాతం మధ్య ఉంటాయి. ఈ విభాగంలో చెత్త పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ జమ కావడం) మహిమ ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకోవాలి.
ఒకవేళ మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్‌తో అనుసంధానమైన పెట్టుబడులు ఏవైనా కానీ, పెట్టుబడులు పెట్టేసి మర్చిపోతానంటే కుదరదు. కచ్చితంగా వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే మంచి పథకాలన్నవి చెత్తగాను, చెత్త పథకాలుగా ఉన్నవి మంచిగానూ మారిపోతుంటాయి. ఒకే పథకంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లలేం. ఎందుకంటే ఒకవేళ అది చెత్తగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్‌ఎస్‌ఎస్ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్ ముగిసిపోతుంది.
చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment