న్యూఢిల్లీ: బీటూబీ ఈ-కామర్స్ వేదిక ఉడాన్ దేశవ్యాప్తంగా 300-350 మంది సిబ్బందిని తొలగించినట్టు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. (బైజూస్ ఈఎఫ్‌ఏ ప్రచారకర్తగా ఫుల్‌బాట్ స్టార్ ప్లేయర్)
ఎంత మందికి ఉద్వాసన పలికిందీ వెల్లడించనప్పటికీ తాజా నిర్ణయాన్ని కంపెనీ నిర్ధారించింది. లేఆఫ్‌లపై ఉడాన్ ప్రతినిధి మాట్లాడుతూ ఉడాన్ లాభదాయకమైన కంపెనీగా ఎదుగుతున్న క్రమంలో సామర్థ్యం పెంపుదల డ్రైవ్ , వ్యాపార నమూనాలో పరిణామం సిస్టమ్‌లోఎక్కువ పని అందుబాటులో లేనందున, కొన్ని ఉద్యోగాల అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైన సంస్థగా ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి కృషి చేస్తున్నట్టు ఉడాన్ ప్రతినిధి చెప్పారు. కాగా ఈ రౌండ్ తొలగింపుల కారణంగా 1,000 మంది ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయని అంచనా. మార్నింగ్ కాంటెక్ట్స్ ప్రకారం ఉడాన్ జూన్ 2022లో 180 మంది ఉద్యోగులను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment