
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ఆరంభించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కొలుకున్నట్లు కనిపించిన ఆ తర్వాత తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 149.38 పాయింట్లు (0.26%) క్షీణించి 57,683.59 వద్ద ఉంటే, నిఫ్టీ 69.60 పాయింట్లు లేదా 0.40% నష్టపోయి 17,206.70 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద ఉంది. పవర్ గ్రిడ్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. కోల్ ఇండియా, హిందాల్కోలు 3 శాతానికిపైగా.. యూపీఎల్, ఓఎన్జీసీ, సన్‌ఫార్మాలు 2.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకు సెక్టార్ మినహా.. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలు 1-2 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి.
(చదవండి: రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..!)
Comments
Please login to add a commentAdd a comment