ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు రాణించడంతో శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ కలిసొచ్చింది. ఫలితంగా ఇంట్రాడేలో 722 పాయింట్లు పతనమైన సెనెక్స్ చివరికి 21 పాయింట్ల స్వల్ప లాభంతో 52,344 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 240 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఎనిమిది పాయింట్లు స్వల్ప నష్టంతో 15,683 వద్ద నిలిచింది. అస్థిర పరిస్థితుల్లో రక్షణాత్మక రంగంగా భావించే ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీతో ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లూ కొంత మేర రాణించాయి. ఇక మిగిలిన రంగాల షేర్లన్నీ నష్టాలను చవిచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment