దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఇజ్రాయెల్ - హమాస్‌ల మధ్య దాడులతో దేశీయ స్టాక్ సూచీలు నేలచూపులే చూశాయి. అయితే, అక్టోబర్ 10న ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సడలించింది.
ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్లు లాభంతో 66,079 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 19,689 వద్ద ముగిశాయి.
కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు లాభాల్లో ముగియగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్,ఏసియన్ పెయింట్స్ నష్టాలతో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment