
ముంబై: ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, మరో విడత యూఎస్ ఫెడ్ రేట్లను పెంచొచ్చన్న భయాలతో అంతర్జాతీయంగా బేరిష్ సంకేతాలు నెలకొన్నాయి.
ఇవి మన మన మార్కెట్లపైనా ప్రభావం చూపించాయి. దీంతో ఇన్వెస్టర్లలో రిస్క్ ధోరణి తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి డాలర్ మారకంతో రూపాయి మరో కొత్త కనిష్టానికి చేరడం కూడా ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలో గరిష్టం నుంచి 800 పాయింట్లు పడిపోయింది. చివరికి 200 పాయింట్ల నష్టానికి (0.34 శాతం) పరిమితమై 57,991 వద్ద క్లోజయింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 74 పాయింట్లు నష్టపోయి (0.43 శాతం) 17,241 వద్ద ముగిసింది.
►ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా నష్టాలను ఎదుర్కొన్నాయి.
►యాక్సిస్, టీసీఎస్, మారుతీ, విప్రో, ఇ న్ఫీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ లాభపడ్డాయి.
►సెన్సెక్స్ 30 కంపెనీల్లో 19 నష్టాల్లో ముగియడం ప్రతికూల సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది.
►బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.87 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.58 శాతం చొప్పున నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment