సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. భారత కంపెనీలు విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల నేపథ్యంలో నేడు భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు మరో రికార్డు స్థాయిని సాధించాయి. భారతీయ కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక లాభాలలో గత ఏడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 నాలుగు త్రైమాసికాలలో ఇదే అతిపెద్ద పెరుగుదల. దీనితో సెన్సెక్స్ 692 పాయింట్లు పెరిగి 52,235.97 రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 50 ఇండెక్స్ పెరిగి 15,300ను అధిగమించింది. నేడు సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 1.18 శాతం పెరిగి ఆల్ టైమ్ హై 52,154 వద్ద ముగిసింది. నిఫ్టీ 1 శాతం లేదా 151 పాయింట్లు పెరిగి 15,315 వద్ద స్థిరపడింది. కరోనా తర్వాత కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు వేగంగా పుంజుకోవడంతో మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముగిసినట్లు విశ్లేషకులు తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment