ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాలతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని చిన్న షేర్లు ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, రినైసన్స్ గ్లోబల్ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, ఏవీటీ నేచురల్ ప్రొడక్ట్స్, పొద్దార్ హౌసింగ్ చేరాయి. వివరాలు చూద్దాం..
హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతంపైగా దూసుకెళ్లి రూ. 781 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 834ను సైతం అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1500 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 11,000 షేర్లు చేతులు మారాయి.
రినైసన్స్ గ్లోబల్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 43 ఎగసి రూ. 256 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 250 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 2,000 షేర్లు చేతులు మారాయి.
కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 129 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 68,000 షేర్లు చేతులు మారాయి.
ఏవీటీ నేచురల్ ప్రొడక్ట్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 10 పతనమై రూ. 39 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 40,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 68,000 షేర్లు చేతులు మారాయి.
పొద్దార్ హౌసింగ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3.4 శాతం క్షీణించి రూ. 174 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 900 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 600 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment