స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల 17న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల అయిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. విడుదల అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఇది కొరియన్ భాషలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్. "స్క్విడ్ గేమ్" వల్ల నెట్ ఫ్లిక్స్ కు దాదాపు 900 మిలియన్ డాలర్లు లాభం కలిగినట్లు తెలుస్తుంది.
నెట్ ఫ్లిక్స్ మూవీ స్టూడియోలు, టీవీ నెట్ వర్క్ స్టూడియోల కంటే భిన్నంగా ఉంటుంది. "స్క్విడ్ గేమ్" భాగ ప్రజాధరణ పొందడంతో పరోక్షంగా సంస్థకు భారీ ప్రయోజనం కలిగింది. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్‌లో మొత్తం 8 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉంది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ వల్ల కొత్తగా చాలా మంది కొత్త చందాదారులు వచ్చి చేరారు. దీంతో సెప్టెంబర్ 17న "స్క్విడ్ గేమ్" విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగింది. ఇలా సంస్థ విలువ $278.1 బిలియన్లకు చేరుకుంది. ఇటు కొత్త చందాదారులు చేరడం, షేర్లు విలువ భారీగా పెరగడంతో సంస్థ విలువ కూడా భారీగా పెరిగింది.
(చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..!)
Comments
Please login to add a commentAdd a comment