
శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 662.87 పాయింట్ల నష్టంతో 79,402.29 వద్ద, నిఫ్టీ 218.60 పాయింట్ల నష్టంతో 24,180.80 వద్ద నిలిచాయి.
ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, సన్ ఫార్మా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment