
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ల ప్రారంభంలో 156 పాయింట్ల లాభంతో 65,446 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 19,392 వద్ద కొనసాగుతుంది.
రిలయన్స్, బజాజ్ ఆటో,హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, ఎస్‌బీఐ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్,టైటాన్ కంపెనీ, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్ తీరుతెన్నులు
జాబ్ డేటా విడుదల తర్వాత యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మిశ్రమంగా ముగిశాయి. ఆ ప్రభావం ఏసియన్ మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లలో జూన్ ద్రవ్యోల్బణం డేటా విడుదల, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ తీరుతెన్నులపై బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు చెబుతున్నారు. దీంతో పాటు పలు కంపెనీల ఫలితాల, ఐపీవో వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటీవ్ ఎక్కువగా ఉందని అంటున్నారు.
►గత శుక్రవారం యూరప్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగింపు, అలాగే వాల్ స్ట్రీట్ క్రాష్ వంటి అంశాలకు ప్రధాన కారణం యూఎస్ జాబ్ డేటా విడుదలతో పాటు, వడ్డీ రేట్ల పెంపు కారణమని కారుణ్య రావు విశ్లేషించారు.
►ఇక, అంచనాల్ని తలకిందులు చేస్తూ చైనా జూన్ ద్రవ్యల్బణ డేటా విడుదలతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ ఫలితాలు రాబట‍్టే అవకాశం ఉంది. దీంతో ఆసియా మార్కెట్లు ఈఎస్‌ఎస్‌ఎక్స్ (న్యూయార్క్) , కోస్పీ (Korea Composite Stock) నష్టాల్లో కొనసాగుతున్నాయి.
►షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ (SSE) ,షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SZSE) లాభాల్లో ఉన్నాయి. వాటికి భిన్నంగా బీఎస్‌ఈ లాభాల్లో ఉంటే అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా నిఫ్టీ మార్కెట్లు గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి.
►రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉన్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)ని 2023 సెప్టెంబర్ నాటికి.. విడిగా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇదే జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 36 లక్షల మంది రిలయన్స్ వాటాదారులకు జేఎఫ్‌ఎస్‌ఎల్ షేర్లను అలాట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మీ వద్ద ఒక రిలయన్స్ స్టాక్ ఉంటే.. ఈ డీమెర్జర్‌తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక షేర్ అదనంగా కలుస్తుంది. ఈ డీమెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపడంతో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
►బ్యాంక్ నిఫ్టీలో..హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ తీరుతెన్నుల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా, హెచ్‌డీఎఫ్‌సీ జులై 13 నుంచి ఎంఎస్‌సీఐలో( Morgan Stanley Capital International - msci)ఇండెక్స్ అవ్వనుంది.
►మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఫార్మా విభాగంలో జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కీలక పరిణామం చోటు చేసుకుంది. మూర్ఛ చికిత్స కోసం ఆక్స్‌కార్‌బాజెపైన్ టాబ్లెట్స్ పేరుతో యూఎస్‌పీ, 150ఎంజీ, 300ఎంజీ, 600 ఎంజీ మెడిసిన్ తయారీ కోసం గుజరాత్‌లోని అహ‍్మదాబాద్ కేంద్రంగా తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అనుమతి పొందింది.
►అరబిందో ఫార్మా సబ్సిడరీ కురాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Curateq Biologics Private Limited) అమెరికాకు చెందిన బయోఫ్యాక్చురాతో ప్రమాదకరమైన క్యాన్సర్, కోవిడ్ -19 నుంచి సురక్షితంగా ఉండేలా యాంటీ బాడీ మెడిసిన్‌ను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రైట్ ఇష్యూ ద్వారా రూ.22,000కోట్లను సమీకరించేందుకు బోర్డ్ అనుమతి ఇచ్చింది.బ్యాటరీ స్పైపింగ్ బిజినెస్ కోసం మరో సంస్థతో కలిసేందుకు అనుమతులు జారీ చేసింది.
ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)