స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు | Stock Market News in Telugu | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

Published Mon, Dec 26 2022 9:31 AM | Last Updated on Mon, Dec 26 2022 9:35 AM

Stock Market News in Telugu  - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. గతవారం చైనాతో పాటు పలుదేశాల కోవిడ్‌ కేసుల నమోదు, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, బలహీన అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక మాంద్య భయాలతో సూచీలు రెండున్నర శాతం పతనమయ్యాయి. అయితే ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగానే దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్‌ 258 పాయింట్ల స్వల్పలాభంతో 60103 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 17883 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది. 

ఇక హెచ్‌యూఎల్‌,నెస్లే, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎయిర్‌టెల్‌, టాటా, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఎండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో పుంజుకుంటున్నాయి.   


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement