దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 29 పాయింట్లు తగ్గి 24,324కు చేరింది. సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోయి 79,566 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.61 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.92 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.05 శాతం, నాస్‌డాక్ 0.2 శాతం లాభపడ్డాయి.
పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదైంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment