ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 270 పాయింట్ల మేర పెరిగి 50922.30, నిఫ్టీ 15291.80, నిఫ్టీ బ్యాంకు సూచీలు 35095 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఈ మేరకు లాభాలతో ఆరంభమయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్. నెస్టే ఇండియా, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెడ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఇండస్ ఇండ్, ఎస్బీఐ బ్యాంకులు, రిలయన్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ కిందకు దిగజరాయి. ఓ దశలో సెన్సెక్స్ 50,474 వద్ద, నిఫ్టీ 15,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 14 పాయింట్లు కోల్పోయి 50,637 వద్ద ముగిస్తే.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 15,208 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.77 వద్ద నిలిచింది. గత రెండు సెషన్ల భారీ లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆర్థిక, విద్యుత్తు, బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment