TaTa Electric Vehicles: Tata Inks Deal To Supply BluSmart Mobility With 3500 XPRES T EVs - Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా!

Published Fri, Oct 29 2021 4:19 PM | Last Updated on Sat, Oct 30 2021 9:23 AM

Tata Inks Deal To Supply BluSmart Mobility With 3500 XPRES T EVs - Sakshi

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు భారీ ఆర్డర్లతో కాసుల వర్షం కురుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం టెస్లాకు 1,00,000 ఎలక్ట్రిక్ కార్లు కావాలని అమెరికా రెంటల్‌ కార్‌ కంపెనీ హెర్జ్‌ ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మన దేశానికి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్​కు కూడా ఒక భారీ ఆర్డర్ వచ్చింది. రైడ్-హైలింగ్ ఫ్లాట్ ఫారం బ్లూస్మార్ట్ మొబిలిటీ 3,500 టాటా ఎక్స్‌ప్రెస్‌-టీ ఈవీ యూనిట్లు కావాలని ఆర్డర్ చేసినట్లు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సంస్థ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల సరఫరా కోసం బ్లూస్మార్ట్ మొబిలిటీతో అవగాహనపూర్వక ఒప్పందాన్ని(ఎంఓయు) కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. 

బ్లూస్మార్ట్ మొబిలిటీ ఒప్పందం:
"ఎక్స్‌ప్రెస్‌-టీ ఈవీ కార్లను కంపెనీ ఫ్లీట్ కస్టమర్ల కొరకు టాటా ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. బ్లూస్మార్ట్ మొబిలిటీతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది" అని టాటా మోటార్స్ హెడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (కమర్షియల్) రమేష్ దొరైరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. టాటా టిగోర్ ఫేస్ లిఫ్ట్ ఆధారంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన ఎక్స్‌ప్రెస్‌-టీ ఎలక్ట్రిక్ వాహన ఎక్స్ టీ+ ధర రూ.9.9 లక్షలుగా ఉంది. ఎక్స్‌ప్రెస్‌-టీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 200కి పైగా కిలోమీటర్లు వెళ్లనుంది. దీనిలో 21.5కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 40హెచ్ పీ, 105 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును 110 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 

(చదవండి: ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మరిచిపోయారా? ఇలా చేయండి!)

"మేము గత కొద్ది రోజుల 10,000 ఈవీల కీలక మైలురాయిని చేరుకున్నాము. ఇది మా సృజనాత్మక ఎలక్ట్రిక్ వాహనాలకు బలమైన నిదర్శనం. భవిష్యత్ లో మరిన్ని ఎలక్ట్రిక్ వహాలనాలతో ముందుకు వచ్చేందుకు మేము సిద్దంగా ఉన్నాము" అని దొరైరాజన్ తెలిపారు. ట్యాక్సీ కంపెనీ బ్లూస్మార్ట్ మొబిలిటీ ఫౌండర్ సీఈఓ అన్మోల్ సింగ్ జగ్గీ మాట్లాడుతూ.. కంపెనీ తన ఇటీవల "సిరీస్ A" ఫండ్ సేకరణలలో భాగంగా 25 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఈ నిదులతో ద్వారా మరిన్ని వాహనాలను రహదారుల మీదకు తీసుకొనిరావడానికి టాటా మోటార్స్​తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

(చదవండి: బిలియనీర్స్‌.. 42 మిలియన్ల మందిని కాపాడండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement