ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సన్నాహాలను చేస్తోంది.టాటా మోటార్స్ నుంచి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో టీజ్ చేసింది. ఈ కారు ఏప్రిల్ 6 న లాంచ్ కానున్నట్లు సమాచారం.
టాటా నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీలకు కొనసాగింపుగా కొత్త మోడల్‌ను టాటా మోటార్స్ లాంచ్ చేయనుంది. కాగా ఈ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇక మరోవైపు టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌టెండెడ్ రేంజ్, టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎక్స్‌టెండెడ్ రేంజ్, టాటా పంచ్ ఈవీ భారత మార్కెట్లలోకి ఈ ఏడాదిలోనే విక్రయించేందుకు టాటా మోటార్స్ సిద్దమవుతోంది.
Stunning. Dynamic. Electrifying.
— Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) March 31, 2022
Stay tuned to #DiscoverDifferent on 06.04.2022 #EvolveToElectric pic.twitter.com/xL8koQJz26
టాటా నెక్సాన్ ఎక్సెటెండెడ్ రేంజ్ ఈవీ కారు, టాటా పంచ్ ఈవీ రెండూ ఏప్రిల్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందని సమాచారం. ఇక టాటా మోటార్స్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు కంపెనీకి చెందిన అన్నీ ఎలక్ట్రిక్ వాహనాల్లో జిప్‌ట్రాన్ పవర్‌ట్రైన్ టెక్నాలజీని ఉపయోగిస్తామని కంపెనీ ప్రకటించింది. కాబట్టి, ఈ కారు IP-67 సర్టిఫికేషన్, 8 సంవత్సరాల వారంటీని కలిగి ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది 325 కిమీ కంటే ఎక్కువ డ్రైవ్ పరిధిని అందించే అవకాశం ఉంది.
చదవండి: గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment