లైంగిక వేధింపులు, ఎలన్‌ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ | Tesla Woman Employee Alleged Harassment At Factory | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు, ఎలన్‌ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ

Published Sun, Nov 21 2021 9:34 AM | Last Updated on Sun, Nov 21 2021 1:39 PM

Tesla Woman Employee Alleged Harassment At Factory - Sakshi

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మరో ఎదురుదెబ్బ తగిలింది. టెస్లా కంపెనీలో లైంగిక వేధింపులు ఎక్కువైతున్నాయంటూ  ఆ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. దీంతో వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎలన్‌కు మరో ఎదురు దెబ్బతగిలినట్లైందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

ది వాషింగ్టన్ పోస్ట్‌ నివేదిక ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీలో టెస్లా మోడల్ 3లో పనిచేసే మహిళా ప్రొడక్షన్ అసోసియేట్ కోర్ట్‌లో దావా వేశారు. వర్క్‌ ప్లేస్‌లో లైంగిక వేధింపులకు గురైనట్లు దావాలో పేర్కొన్నారు. దాదాపు 3ఏళ్ల పాటు లైంగిక వేధింపులకు గురైనట్లు, ఆ వేధింపులు ఇంకా ఎక్కువ కావడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేశారు.  

నా శరీరం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. తరుచూ తోటి ఉద్యోగులు దాడికి పాల్పడుతున్నారని ఆరోపించింది. 'ది వెర్జ్‌' తో ఆమె ఇలా చెప్పింది.' దాదాపు 3ఏళ్ల నుంచి ప్రతిరోజూ నా మహిళా సహోద్యోగులు బెదిరించే వారు. అసభ్య పదజాలంతో దూషించే వారు. ఆఫీస్‌లో పనిచేయాలనే ఉద్దేశంతో అనేక దాడుల్ని ఎదుర్కొన్నాను. నిరంతరం లైంగిక వేధింపులకు గురికావాల్సిన అవసరం లేదు. నా కుటుంబం కోసమే అన్నీ భరించాల్సి వచ్చింది. ఇకపై భరించే ఓపిక నాలో లేదు. నన్ను, నా కుంటుంబాన్ని ఆదుకోవాలని వ్యాఖ్యానించింది.  

చదవండి: ఎలన్‌మస్క్‌ ఎందుకిలా జరుగుతోంది? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement