
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సైతం లాభాల బాట పట్టాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 410 పాయింట్ల లాభంతో 58471 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 17402 వద్ద కొనసాగుతోంది.
హిందాల్కో, కోల్ ఇండియా, టాటా మోటార్స్,జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సెన్, హెచ్‌సీఎల్ టెక్,టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతి సుజికి, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, సిప్లా, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివిస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment